నెకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా వర్ధిని సమేత రాలింగేశ్వరస్వామి వారి దేస్థాన నూతన ధ్వజస్తంభ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర నాయకులు నాగోతు సౌరయ్య, సాగి కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.