రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలంలోని కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల తుమ్మలపాలెం గ్రామంలో వేసవికాలంలో ఎండ తీవ్రతకు చిన్నారులు అతిసార వ్యాధి బారిన పడకుండా జింక్ టాబ్లెట్లు మరియు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అంగన్వాడి సెంటర్లో చిన్నారులకు, గ్రామంలోని చిన్నారులకు గురువారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ వో మణి కుమారి, ఏఎన్ఎం శాంతి, ఆశ వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ శ్రీలత తెలియజేశారు