రేషన్ పంపిణీ సందర్భాల్లో రేషన్ వాహన అపరేటర్లను దుర్బాషలతో , బౌతికంగా దాడులు చేసే సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయని వీటిని అరికట్టాలని మైదుకూరు మండల మునిసిపాలిటీ రేషన్ వాహన ఆపరేటర్లు పేర్కొన్నారు. గురువారం నాలుగు రోడ్ల కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మైదుకూరు మండలంలోని ముదిరెడ్డిపల్లె దళితవాడలో గత బుధవారం ఎండియు ఆపరేటర్ పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ దాడి ఘటనలో నష్టపోయిన మంత్రేనాయక్ కు సొమ్ము రికవరీ చేయించి న్యాయం చేయాలని వారు కోరారు. అలాగే భవిష్యత్ లో రేషన్ వాహన ఎండియు లపై దాడి ఘటన లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మండల, మునిసిపాలిటీ పరిధి రేషన్ వాహన ఎండియు ఆపరేటర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.