ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు శుభవార్త అందించారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకటి ఆడపిల్లలకు, రెండోది కో-ఎడ్యుకేషన్‌గా ఉండాలి. వచ్చే జూన్‌లోగా ఈ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రోజు వారీగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని సూచించారు.