గత తొమ్మిదేళ్లలో బొగ్గు ఉత్పత్తిలో భారత్ 55 శాతం వృద్ధిని సాధించింది. 2013-14లో 572 మిలియన్ టన్నులు ఉండగా, 2022-23లో ఉత్పత్తి 893 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2023-24లో 1 బిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు.ఈ ఏడాది బొగ్గు కొరత ఉండదని, థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద 35 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని, కోల్ ఇండియా, ప్రైవేట్ మైనర్ల వద్ద 65 మెట్రిక్ టన్నులు, మరో 10-12 మెట్రిక్ టన్నులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.బొగ్గు, మైనింగ్ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాలు మెరుగయ్యాయని, బొగ్గు, ఇతర ఖనిజాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు.