ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుడివాడలో జరగాల్సిన పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుడివాడ మండలం మల్లాయపాలెంలో టిడ్కో గృహ సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని సీఎంఓ గతంలోనే ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa