శృంగవరపుకోట మేజర్ పంచాయతీ పరిధిలోగల స్థానిక బర్మా కాలనీకి చెందిన కర్మోజి రమణమ్మ అనే మహిళ ఇటీవల మృతి చెందింది. ఈ మేరకు జగనన్న బీమా పథకం కింద మంజూరైన తక్షణ సహాయం 10 వేల రూపాయల నగదును శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారి చేతుల మీదుగా మృతురాలి కుటుంబానికి గురువారం అందజేశారు. మిగతా జగనన్న బీమా డబ్బులను మృతురాలి కుటుంబానికి సత్వరమే వచ్చేలా తగిన చర్యలు చేపడతానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోషి కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు బలహీన, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలకుక్ట అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థిక తోడ్పాటుకు చేయూతనందిస్తున్నారని, ఇందుకు నిదర్శనం జగనన్న బీమా పథకమేనని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు గొడుగు సంతోష్ కుమార్, గంగరాజు, సచివాలయ సిబ్బంది సాగర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.