బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం పరిసర ప్రాంతాలలో సంబంధిత అధికారులు వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులు స్వామి వారి ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులలో భాగముగా ఐమాక్స్ లైటింగ్ సిస్టం ఏర్పాట్ల విషయంలో కొన్ని మార్పులు చేయాలని శుక్రవారం స్థానిక ప్రజలతోపాటు వివిధ రకాల ప్రజాసంఘాల నాయకులు సంబంధిత అధికారులను ఓ ప్రకటనలో తెలిపారు,
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దక్షిణం ఒక ద్వారము ముందు భాగములో ఏర్పాటు చేస్తున్న ఐమాక్స్ లైటింగ్ సిస్టం ఉత్సవాల సమయంలో స్వామివారి పల్లకి కి ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనపడుతుందని, అభివృద్ధి పనులు చేసే సమయంలో శాశ్వత పనులు చేయలే తప్ప తాత్కాలిక పనులు చేయడం వల్ల డబ్బులు వృధా చేయడమే ప్రస్తుతం అలాంటి పనులే చేస్తున్నారని స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దక్షిణ ముఖ ద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేస్తున్న ఐమాక్స్ లైటింగ్ సిస్టంను శాశ్వతంగా భక్తులకు ఉత్సవాల సమయంలో పల్లకికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అలా చేయని యెడల ఆందోళన చేపడతామని స్థానిక ప్రజా సంఘాలు కోరుతున్నారు.