లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మైలవరం మండలం ఎంపీడీవో వై. రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. గురువారం మైలవరం మండల పరిధిలోని వద్దిరాల గ్రామంలోని సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సమస్యల గురించి అధికారులకు అర్జీలు అందజేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి గురువారం సచివాలయ పరిధిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.