మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మే 31న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత ఈ నెల 6న పిటిషన్ వేశారు. విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదని ఆమె తరపు న్యాయవాదులు వాదించనున్నారు.