రేపల్లె 13వ వార్డులో శుక్రవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.