మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని ఏపీ మున్సిపల్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ గత నెల 30వ తేదీన ఇచ్చాపురం నుండి బయలుదేరిన రాష్ట్రస్థాయి మున్సిపల్ ప్రచార జాత గురువారం మంగళగిరి చేరుకుంది. ఈ సందర్భంగా జాతీయ బృందానికి మున్సిపల్ కార్మికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆర్ వేణు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఉమామహేశ్వర మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమ్మకు పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందిపై పాలకులకు కనికరం లేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్మికులకు వేతనాలు పెరిగాయని అన్నారు. సీఎం జగన్ మహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలన చేస్తానని చేయడం లేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి టీ నూకరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు వరలక్ష్మి, నాయుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ చంగయ్య, సిఐటియుమంగళరు పట్టణ కార్యదర్శి వై కమలాకర్, యూనియన్ నాయకులు పి పూర్ణ, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.