వైఎస్సార్ బీమా యోజన పురోగతి వేగవంతం చేయాలని ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య అన్నారు. గురువారం వినుకొండ పట్టణం శావల్యాపురం మండల పరిషత్ కార్యాలయంలో పథకం పురోగతిపై సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు. ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో 10 వేల 281 మంది రైస్ కార్డు దారులు అర్హత కలిగిన లబ్ధిదారులు ఉండగా, 4577 మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే నమోదు చేశారన్నారు.