విశాఖనగర పోలీసులు , లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తించి, వారిని పనుల నుంచి విముక్తి కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ గురువారం చెప్పారు. జూన్ 1 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించామని, ఇంతవరకు 17 బాలబాలికలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. బాల కార్మికులు, కౌమారా దశలో ఉన్న వారిని సదరు చాకిరీ నుంచి విముక్తి కలుగ చేసీ, వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.