భర్తతో గొడవపడి మనస్థాపం చెంది బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళను సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆచూకీ కనుకున్న ఘటన గోపాలపట్నం పోలీసు గురువారం ఆమే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి సీఐ ఈదుల నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం పాత గోపాలపట్నం చెందిన ద్వారపూడి దేముడుతో కె కోటపాడుకు చెందిన ద్వారపూడి దర్గ(28)కు 2019లో వివాహం అయ్యింది. 2020లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి కే కోటపాడు లో గల సూరెడ్డి పాలెం తన పుట్టింటికి వెళ్లిపోయింది.
అనంతరం తిరిగి 2023 జూన్ 3 న తన నాలుగు సంవత్సరాల కుమారుడిని తీసుకుని పాత గోపాలపట్నం లో గల తన భర్త ఇంటికి వచ్చింది. అయితే మల్లి మనస్పర్ధలు రావడంతో ఈనెల 6వ తేదీన గోపాలపట్నం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి కుమారుని తీసుకొని వెళ్ళిపోయింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ లో సికింద్రాబాద్ వేల్లిపోయింది. అమె భర్త ద్వారపూడి దేముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో 7 న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు. ఆమె సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా అమె ఆచూకీ కనుగొని సీఐ నరసింహారావు ఆమె తో మాట్లాడి, కౌన్సిలింగ్ చేసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఆమెను కుమారుడిని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందిని అభినందించారు.