విశాఖ జిల్లా పెందుర్తి ఎస్. ఆర్. పురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పల్లా తేజ(5) అనుమానాస్పద మృతి చెందాడు.గురువారం బాలుడు తప్పిపోయినట్లుగా పెందుర్తి స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా శుక్రవారం ఒక షెడ్డు వద్ద విగతజీవుడుగా కనపడటంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళనలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కె. జి. హెచ్. కు తరలించారు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సంఘటన స్థలంలో బాలుడు తేజ ఒంటిపై గాట్లు ఉండటంతో.. పాము కరిచి వుండవొచ్చుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.