అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చిన్న తీనార్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజలను మన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రభుత్వ మీకు మంచి చేసింది అని మీరు నమ్మితేనే మీరు ఓటెయ్యండి అని ఎమ్మెల్యే ప్రజలతో అన్నారు. ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే 2024లో మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే బాబురావు కోరారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సీరం నరసింహమూర్తి, వైఎస్ఆర్సిపి సర్పంచులు, ఎంపీటీసీలు ,జడ్పిటిసిలు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, వైయస్సార్సీపి కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.