2021 సంవత్సరంలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తిని గురువారం అరెస్టు చేశామని అరకులోయ ఎస్ఐ సంతోష్ కుమార్ తెలియజేశారు. ఎస్ఐ సంతోష్ కుమార్ కథనం ప్రకారం. 2021 సంవత్సరంలో బొండంగుడకి చెందిన గిరిజనుడు బురిడి సాంబ మైదాన ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులకు 18 కిలోల గంజాయిను తరలిస్తూ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ముద్దాయి సాంబను అరకులోయలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.