వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యలయంలో మూడు రోజులుగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు,జిల్లా అధ్యక్షులుతో ఎంపీ విజయసాయిరెడ్డి వరుసగా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా పార్టీ ఎస్సీ విభాగం సమావేశం ఆ విభాగ అధ్యక్షులు జూపూడి ప్రభాకర్, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్,ఎమ్మెల్యే అనిల్ కుమార్ నేతృత్వంలో విజయసాయిరెడ్డి అధ్యక్షతన జరిగింది..వైయస్ఆర్ సిపి రాష్ట్ర ఎస్సీ విభాగానికి నలుగురు అధ్యక్షులు ఉండగా మరో అధ్యక్షుడుగా రెల్లి సామాజీక వర్గానికి కూడా పదవి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు..