జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభం కానుందన్నారు. పిల్లలను బడులకు పంపించే తల్లుల ఖాతాల్లోకి సీఎం వైయస్ జగన్ నగదు జమ చేయనున్నారని వివరించారు. నాడు–నేడు మొదటి ఫేస్‌లో పూర్తయిన పాఠశాలల్లో డిజిటల్ విద్య అందుబాటులోకి రానుందన్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. అదే విధంగా ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు తీసుకొస్తున్నామని, ఇందులో ఒక కాలేజీ కేవలం విద్యార్థినులకు మాత్రమేనని చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని, అంతేకాకుండా రాగిజావ కూడా అందిస్తున్నామన్నారు.