ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో మత్స్యకారుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. వారి జీవనోపాధి పెంపొందించడానికి చర్యలు చేపట్టారు. గంగపుత్రుల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించనుంది. మత్స్యకారుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫిష్ ఆంధ్ర పథకంలో భాగంగా మత్స్య ఉత్పత్తుల విక్రయ దుకాణాల నిర్మాణాలకు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కృష్ణానదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో పలు దుకాణాల నిర్మాణాలకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.