ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, పల్నాడు జిల్లా క్రోసూర్లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న విద్యా కానుక ఒక్కో కిట్‌కు రూ.2500 ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నామన్నారు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సాహకాలు అందజేయనున్నామన్నారు.