ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత దేశానికి మరో ప్రమాదం పొంచి ఉందని కోడిమఠం శివానంద శివయోగి స్వామి తెలిపారు. ఆయన తరచూ జోస్యాలు చెబుతూ ఉండడం తెలిసిందే. తాను గతంలో చెప్పినట్లుగా ఈసారి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం వచ్చింది. అలాగే, ఈ ఏడాది పెద్ద ప్రమాదం సంభవిస్తుందని తెలిపిన విధంగానే ఘోర రైలు ప్రమాదం జరిగింది. దేశానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఆధ్యాత్మికత దారి తప్పితే ప్రమాదమన్నారు.