ప్రపంచ సుందరి పోటీలు ఈసారి మన దేశంలో జరుగనున్నాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లీ వెల్లడించారు. 71వ మిస్ వరల్డ్ పోటీలు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్లో జరగబోతున్నాయి. అయితే తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదు. నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. కాగా భారత్లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి.