లింగాల మండలంలోని లింగాల రైతు భరోసా కేంద్రంలో లింగాల రైతు భరోసా కేంద్రం వద్ద ఖరీఫ్ 2023 సబ్సిడీ వేరుశెనగ కాయలను రైతులకు లింగాల సర్పంచ్ జుబాకర్, మరియు లింగాల మండల వ్యవసాయ అధికారి రమేష్, పంపిణీ చేయడం జరిగింది అన్నారు. లింగాల మండల వ్యవసాయ అధికారులు రమేష్ మాట్లాడుతూ. లింగాల మండలంలో ఖరీఫ్ 2023 సంబంధించి మండలానికి 500 క్వింటాలు వేరుశనగ విత్తన కాయలు మంజూరయ్యాయని ఆయన అన్నారు. వీటికి గాను మండలంలోని రైతు భరోసా కేంద్రాలలో ఇప్పటివరకు 485 క్వింటాలు రైతులకు నమోదు చేయడం జరిగింది. అన్నారు. నమోదు చేసుకున్న మొత్తాన్ని రైతులక్ను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర ఇంచార్జ్ రాణి, గ్రామ రైతులు పాల్గొన్నారు.