చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలం, బెంగళూరు- చెన్నై జాతీయ రహదారిపై నల్లగాంపల్లి వద్ద గురువారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో, మడుపోలూరికి చెందిన రంగనాథ నాయుడు ఆయన భార్య లక్ష్మమ్మకు తీవ్రగాయాలు కావడంతో, 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో లక్ష్మమ్మకు ఎక్కువగా గాయాలైనట్లు మడు పోలూరు గ్రామస్తులు తెలిపారు.