ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఏపీ ఎన్టీవో నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు. అనంతరం ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేబినెట్‌లో 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ఇచ్చే విషయంలో సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంలో కృషి చేసిన మంత్రివర్గ సభ్యులు సీఎస్ జవహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్ లాంటి సంస్థ సహా మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా ఇచ్చేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.