ఎన్టీఆర్ జిల్లాలోని జి. కొండూరు మండలం వెల్లటూరులో బొడ్డు బాలయ్య (30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ వైన్‌షాప్‌కు 200 మీటర్ల దూరంలో బాలయ్య మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే జి.కొండూరు సీఐ ధర్మరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివారలు సేకరించారు. బాలయ్య శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే మృతదేహం పక్కన మద్యం సీసాలు పడిఉన్నాయి. ఎవరైనా కొట్టి చంపారా? లేక.. మద్యం మత్తులో కిందపడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే యువకుడి మృతిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలో ప్రభుత్వ మద్యం షాపు ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. మద్యం షాపు ఏర్పాటు చేసినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు, గొడవలు అధికమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.