ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను ఉంచిన బాహానగా హైస్కూలును కూల్చివేసినట్లు ఆ పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజారామ్ మోహాపాత్ర తెలిపారు. శవాలను ఉంచిన గదులను శానిటైజ్ చేసినా పిల్లలు స్కూలుకు రావడానికి భయపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త భవనం నిర్మించి పూజలు నిర్వహించిన తర్వాత స్కూలును పునఃప్రారంభిస్తామన్నారు.