పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు శుక్రవారం 222వ రోజు అప్పికట్లకు చెందిన యలవర్తి పూర్ణచంద్రరావు కుమారుడు రామకృష్ణ పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో దాదాపు 350 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ ధన్యవాదాలు తెలియజేశారు.