జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు దుష్టశక్తులతో పొత్తు, సహవాసం మంచిది కాదని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌ను అందలంపై చూడాలని కాపులు కోరుకోవడం వాస్తవం. కానీ అతను టీడీపీతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ, చేవ చచ్చిన నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్న పవన్‌కల్యాణ్ ఈసారి నిండా మునగడం ఖాయం. మా దేవుడు వంగవీటి మోహన్ రంగాను హత్య చేయించిన వారితో చేతులు కలపడాన్ని కాపులు సహించలేకపోతున్నారు. అందుకే నా బాధ్యతగా చెప్తున్నా.. సొంతంగా పోటీ చేయాలని సూచిస్తున్నా. పోయినసారి పవన్‌ను చంద్రబాబు కరివేపాకులా వాడుకున్నారు. పవన్ పోటుగాడా ఏంటి? మా శక్తితోమేం గెలిచామన్నారు. అలాంటి టీడీపీతో పవన్‌కు పొత్తు మంచిది కాదని చెప్తున్నా’ అని వ్యాఖ్యానించారు. రంగా కుమారుడు రాధా టీడీపీవైపే ఉన్నారని ఓ విలేకరి ప్రస్తావించగా.. కుర్రోడు కదా.. వయసొచ్చాక తెలుసుకుంటాడు అని వ్యాఖ్యానించారు. పేదలను కోటీశ్వరులను చేస్తాన్న చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎంతమందిని కోటీశ్వరులను చేశారో చెప్పాలన్నారు. వైసీపీ అమలు చేయని 0.5ు పని ఏమిటని ప్రశ్నించగా.. సీపీఎస్ రద్దు వ్యవహారమని చెప్పారు.