కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి- ప్రతీక్‌ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది.ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa