ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు.. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్.. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తంచేస్తూ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.