సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలు అనుకుంటున్నట్లుగా వైయస్ జగన్ చెప్పాడంటే..చేస్తాడంతే అని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైయస్ జగన్ వారిని రెగ్యులర్ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఉద్యోగులు రోడ్డెక్కకుండా 12వ పీఆర్సీని సీఎం వైయస్ జగన్ అమలు చేశారన్నారు.