పీఆర్సీ కమిషన్ వేసినందుకు సీఎం వైయస్ జగన్కు ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా అయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవని శివారెడ్డి అన్నారు.