బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కొవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్, హౌస్ ఆఫ్ కామన్స్ ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్లమెంటును విడిచిపెట్టడం విచారకరం అని, కొద్దిమంది వ్యక్తుల వల్ల బలవంతంగా బయటకు వెళుతున్నానని అన్నారు.