ఏపీ ప్రభుత్వం గర్భణీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో గర్భిణీలకు అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఆ సేవలను గుంటూరులోని వేదాంతం ఆసుపత్రిలో మంత్రి విడదల రజిని ప్రారంభించారు. సంవత్సరానిని 64 వేల మందికి పైగా టిఫా స్కానింగ్ కు అయ్యే రూ. 7 వేల కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.