విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధమైన సంఘటన రేపల్లె పట్టణంలోని మూడో వార్డులో జరిగింది. శనివారం ఉదయం రేపల్లె పట్టణంలోని మూడో వార్డుకు చెందిన మండా సత్యనారాయణకి చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం కావడంతో బాధితులు నిరాశ్రయులు అయ్యారు. ఇంటిలోను సామాన్లు మొత్తం కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.