పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్ బి క్యాబిన్ సమీపంలో రైలు కింద పడి ఓ మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుంది. ట్రాక్ పై పడి ఉన్న మృతదేహన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మహిళ పసుపు ఆకుపచ్చ కలిగిన చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించి చేతికి వాచ్ ఉందని పోలీసులు తెలిపారు. ఆమెకు సుమారు 35 ఏళ్లు ఉంటాయని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.