బాపట్ల జిల్లా పంచాయతీరాజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాంబాబు శనివారం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రేపల్లెలోని ఎంపీ స్వగృహంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నూతన డిపిఓ రాంబాబుకు ఎంపీ మోపిదేవి సూచించారు. వైసిపి సీనియర్ నాయకుడు బండారు రామారావు పాల్గొన్నారు.