రానున్న రాజస్థాన్ శాసనసభ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకునేందుకు బీజేపీ మతపరమైన సున్నితమైన ప్రకటనలు చేస్తుందన్నారు. ఇది కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సత్ఫలితాలు ఇవ్వలేదని, రాజస్థాన్‌లో కూడా ఆ పార్టీ పతనమవుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారం చేయకుండా మోదీని నిలువరించాలని తాను ఎన్నికల కమిషన్‌ను కోరానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa