ప్రొద్దుటూరు స్థానిక రాజీవ్ సర్కిల్ నందు కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు అప్పపోగుల ఎల్లయ్య అధ్యక్షతన సభ్యత్వ నమోదు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎల్లయ్య మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య ఆదేశాల మేరకు నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10 నుంచి జూలై 10 వరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సభ్యత నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే తోపుడుబండ్ల వ్యాపారులు ఆటో డ్రైవర్లు రైతు కూలీలు టాక్సీ డ్రైవర్లు మొదలైన అసంఘటిత రంగాల్లో చెందిన కార్మికులు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆనంద్ రావు, ఖాదర్ బాషా, మనోహర్ బాబు, ఆలీబాబా, తదితరులు పాల్గొన్నారు.