రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని గాలివీడు రహదారి మార్గంలో డా చింతల నాగసుబ్బారెడ్డి మరియు డాక్టర్ బిందు లచే నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష మదర్ అండ్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ ప్రారంభంలో ముఖ్య అతిధి గా శ్రీకాంత్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన దేవి ప్రశాంతి ఆసుపత్రిని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వాహకులు ప్రజలకు విలువలతో కూడిన వైద్యం అందించాలన్నారు. ప్రజల ఆశీర్వాదాలే లక్ష్యంగా వైద్యం అందిచాలని కోరారు.
జిల్లా కేంద్రం ఏర్పాటు తర్వాత రాయచోటిలో ఆధునాతన వైద్యసేవలు ఒక్కొక్కటిగా వైద్యసేవలు అందుబాటులో వస్తుండటం సంతోషదాయకమాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఎక్కడికక్కడ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుందన్నారు. వైయస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైయస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ప్రతి పార్లమెంట్ లో వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందేలా నూతన పరికరాల ఏర్పాటు, ఆసుపత్రుల్లో పడకల పెంపు, వైద్య సిబ్బంది నియామకం లాంటి చర్యలు వేగంగా అమలు చేస్తున్నామన్నారు.