కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఏసియన్ గేమ్స్ లో పాల్గొంటామని, లేదంటే లేదని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేశారు. తాము ప్రతిరోజూ ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నామో మీరు అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. కాగా, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిడ్ భూషణ్ తమను లైంగింకంగా వేధిస్తున్నాడని గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్నారు.