ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆరె.కె.రోజా అస్వస్థతకు గురయ్యారు.చెన్నైలోని నివాసగృహంలో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో గడిపిన రోజా ఉన్నట్టుండి కాలి వాపు, నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స కోసం థౌజండ్ లైట్స్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.చికిత్సతో కాలు వాపు తగ్గిందని, ఆమె పూర్తిగా కోలుకొని త్వరలోనే డిశ్చార్జి అవుతారని వైద్యులు తెలిపారు.