వైసిపి నాయకులు నర్సీపట్నం నియోజకవర్గంలో 17, 402 దొంగ ఓట్లను నమోదు చేయించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. శనివారం ఆయన నర్సీపట్నంలో మాట్లాడుతూ జగన్ రెడ్డి దొడ్డిదారిన అధికారుల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శించారు. దొంగ ఓట్లు నమోదుపై తాను అధికారులకు ఫిర్యాదు చేయగా 2, 443 ఓట్లను మాత్రమే తొలగించినట్లు తెలిపారు. మిగిలిన ఓట్లు తొలగింపుపై తాను మళ్ళీ అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మరోపక్క టిడిపి అభిమానులు సానుభూతిపరులు ఓట్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఓట్లు తొలగింపుపై టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే ఓట్లు తొలగింపుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.