మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడిని నర్సీపట్నం ఆయన స్వగృహంలో అనకాపల్లి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టిడిపి రాష్ట్ర బీసీ సాధికారిక కన్వీనర్ మల్ల సురేంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు. పార్టీ తరఫున అనకాపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు అయ్యన్న తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి వారిలో అవగాహన కల్పించాలన్నారు.