గొలుగొండ మండలంలో పలుచోట్ల కలప వ్యాపారులు టేకు చెట్ల తరలింపుకు చేసుకున్న దరఖాస్తుల మేరకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని నర్సీపట్నం డిఎఫ్ఓ రాజారావు తెలిపారు. శనివారం ఆయన గొలుగొండలో మాట్లాడుతూ పర్మిట్ పొందిన కలప తరలింపులో ఆవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదుల మేరకు శనివారం స్థానిక విలేకరుల సమక్షంలో విచారణ జరిపామన్నారు. పట్టా రైతులు నరికిన కర్రలను వాటి మొదలుక్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ మేరకు తాము ఇచ్చిన అనుమతులు మేరకే పట్టాదారులు టేకు చెట్లను నరికారని ఆయన అన్నారు. తమ అనుమతితో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన టేకు కర్రలను కొలతలు సరిగా ఉన్నది లేనిది పరిశీలించామన్నారు. అలాగే తాము అనుమతులు ఇచ్చిన చోట చెట్లను నరికారా లేదా అనేది కూడా పరిశీలించామన్నారు. ఈ మేరకు ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదని నిర్ధారణ అయిందని తెలిపారు. డిఎఫ్ వెంట రేంజర్ వెంకటరావు డిఆర్డీఓ రాజేష్ గొలుగొండ సెక్షన్ అధికారి లక్ష్మణ్ తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.