జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 14 నుంచి చేపట్టే వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నర్సీపట్నం ఎన్జీవో హోంలో వారాహి యాత్ర గోడ పత్రికను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, అరకు నియోజకవర్గ పార్లమెంటరీ ఇంచార్జ్ గంగులయ్య నర్సీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రాజాన వీర వెంకట సూర్య చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేపడుతున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందన్నారు.