బ్యాంక్ ఫ్రాడ్ కేసులో భూషణ్ స్టీల్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. రూ.56 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ వ్యవహారంలో సీనియర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అధికారులు ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా ఈడీ అధికారులు నీరజ్ సింఘాల్ ఇంట్లో తనిఖీ చేసిన తర్వాత అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపర్చగా.. ఈ నెల 20వ తేదీ వరకు ఈడీ కస్టడీ విధించింది.